
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
జడ్చర్ల: గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గుట్టుగా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. మండలంలోని మాచారం ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి కింద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహేంద్రపాల్, సత్యం ఎండు గంజాయిని ఆరు గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.300కు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న తాము వారిపై దాడి చేసి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 240 గ్రాముల గంజాయితోపాటు రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ కార్తీక్‌రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.