
రోగులను గాలికొదిలేసి.. క్యాండీ క్రష్‌గేమ్
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ ఆదేశాలను కొందరు వైద్యులు తుంగలో తొక్కుతున్నారు. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆదివారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓ వైద్యురాలు రోగులను పట్టించుకోకుండా ఫోన్‌లో క్యాండీ క్రష్ గేమ్ ఆడటాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘును వివరణ కోరగా.. సదరు వైద్యురాలికి మెమో జారీ చేశామని, ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫోన్‌లో గేమ్ ఆడుతున్న వైద్యురాలు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో
వైద్యురాలి నిర్వాకం