
ముగిసిన రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500కుపైగా విద్యార్థులు హాజరయ్యారు. రెండోరోజు బాల, బాలికలకు వేర్వేరుగా కిక్‌బాక్సింగ్ పోటీలు జరిగాయి. నాలుగు సింథెటిక్ కోర్టుల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. గెలుపొందిన వారికి తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ.పద్మాచారి పోటీలను ప్రారంభించి గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసులు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్, కోశాధికారి శ్రీనివాస్, ప్రముఖ కవి రఘువీర్‌ప్రతాప్, హరిసింగ్, మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, సలహాదారులు విజయ్‌కుమార్, ీసీనియర్ విద్యార్థులు నిఖిల్, రోహిత్, యామిని, జయదీప్‌సింగ్, వర్షిని తదితరులు పాల్గొన్నారు.
ఫలితాల వివరాలు
పాయింట్ ఫైట్– 33 కేజీల విభాగంలో షర్వీశుక్లా ప్రథమ, శ్రీనికరెడ్డి ద్వితీయ, అన్విత తృతీయ, నిహారిక నాలుగో స్థానంలో నిలిచారు. 37 కేజీల విభాగంలో వినిత ప్రథమ, అక్షర ద్వితీయ, రక్షిత తృతీయ, కె.వివేకా నాల్గో స్థానం, 50 కేజీల విభాగంలో యక్షిక ప్రథమ, తన్వి చౌదరి ద్వితీయ, శ్రీప్రజ్ఞ తృతీయ, సిగ్ధారెడ్డి నాలుగో స్థానం, 63 కిలోల కేటగిరిలో శివప్రసాద్ ప్రథమ, 37 కిలోల కేటగిరిలో రేవంత్‌రెడ్డి ప్రథమ స్థానాల్లో నిలిచారు. అలాగే మరికొన్ని విభాగాల్లో విద్యార్థులు ప్రతిభచాటి ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాల్లో నిలిచి పతకాలు సాధించారు.
హోరాహోరీగా తలపడిన క్రీడాకారులు
గెలుపొందిన వారికి మెడల్స్ అందజేత

ముగిసిన రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు