
అలంపూర్ ఆలయాల్లో బోనాల సందడి
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారికి ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని నల్లపోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బోనాలు సమర్పించారు. కమిటీ సభ్యులు సుమారు 500 మంది మహిళలు అలంపూర్‌కు చేరుకొని బోనపు కుండలను తలపై పెట్టుకొని కళాకారుల డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. వెండి బోనం, జోగుళాంబ అమ్మవారికి పట్టువస్త్రాలతో ఆలయాలకు చేరుకున్న సభ్యులకు ఈఓ పురేందర్‌కుమార్ స్వాగతం పలికారు. మొదట బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు, ఒక వెండి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను శేషవస్త్రాలతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు.
అమ్మవారికి వెండి బోనం,
పట్టువస్త్రాల సమర్పణ