
లాడ్జీల్లో విస్తృతంగా తనిఖీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని లాడ్జీల్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో పలువురు చీకటి కార్యకలాపాలకు స్థానిక లాడ్జీలను ఎంపిక చేసుకున్నారు. కొందరు యువత, ప్రముఖులు, కూలీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి లాడ్జీల్లో తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. లాడ్జీలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు బస చేస్తున్న వారి వివరాలు, ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారనే వివరాలను యజమానుల నుంచి సేకరించినట్లు తెలిపారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. తనిఖీల్లో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
బాలిక
ఆత్మహత్యాయత్నం
ధరూరు/అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజె క్టు వద్ద బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా బ్లూకోర్టు పోలీసులు గమనించి కాపాడిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. అయిజ మండలం ఉప్ప ల గ్రామానికి చెందిన హనుమంతు తన కుమార్తె(12)ను ఆదివారం మరికల్‌లోని జ్యోతిరావు పూలే స్కూల్‌లోని హాస్టల్‌లో వదిలి వెళ్లాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేని బాలిక అక్కడి నుంచి పారిపోయి సాయంత్రం 7 గంటల సమయంలో జూరాల లెఫ్ట్ కెనాల్ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చింది. అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతున్న బాలికను గమనించిన ధరూరు బ్లూకోర్టు పోలీసులు వినోద్, విక్రమ్ అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
అనుమానితులను
అదుపులోకి తీసుకున్న పోలీసులు