
కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం
గండేడ్: అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారం చెలాయించి చేసిన పాపాలకు వారు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందన్నారు. రేవంత్‌ది దమ్మున్న సర్కారని.. రాబోయే రోజులు కూడా కాంగ్రేస్‌వేనని జోస్యం చెప్పారు. స్థానిక ఎన్నికల సమరం ప్రారంభమైందని.. సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు చిన్న పెద్దా తేడా లేకుండా కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వివిధ పథకాలతో పాటు రైతుభరోసా నిధులు 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమచేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సత్తా చాటారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, కో–అబ్జర్వర్ రాంశెట్టి నరేందర్, పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పుల్లారెడ్డి, జిల్లాపార్టీ ఉపాధ్యక్షుడు అనంతలక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు,
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి