
పత్తి లారీ దగ్ధం
కోస్గి: పత్తి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీకి ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం తెల్లవారుజామున పట్టణ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ యజమాని, డ్రైవర్ భరత్ మహారాష్ట్రలో పత్తిని నింపుకొని ఆంధ్రప్రదేశ్‌లోని నగరి మిల్లుకు తీసుకెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున కోస్గి శివారులోని బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపంలో పత్తికి మంటలు వ్యాపించడం గుర్తించి లారీని నిలిపారు. అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికి పత్తి పూర్తిగా కాలిపోగా.. పొక్లెయిన్ సాయంతో నిప్పంటుకున్న పత్తిని లారీ పైనుంచి కిందకు తోశారు. ఈ ప్రమాదంలో లారీ సైతం దగ్ధమైంది. మార్గమధ్యంలో షార్ట్ సర్క్యూట్‌తో పత్తికి నిప్పంటుకొని మంటలు చెలరేగి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందని లారీ యజమాని తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాలిపోయిన లారీ

పత్తి లారీ దగ్ధం