
సర్వేయర్లు కావాలె..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత
●
సమస్యలు పరిష్కరించాలి..
గ్రామాల్లో భూ సర్వేకు సంబంధించిన సమస్యలతోనే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. గెట్టు పంచాయితీలు, సర్వే నంబర్, సబ్ డివిజన్ సర్వే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. రీ సర్వే చేసి రికార్డులు, మ్యాపులు కొత్తవి సిద్ధం చేయాలి. పూర్తిస్థాయిలో సర్వేయర్లను నియమించి రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వే సమస్యలను పరిష్కరించాలి.
– మల్లేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు,
హన్వాడ మండలం
లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఎంపిక..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేయర్ల కొరత తీర్చేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నాం. వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం. ఎఫ్‌లైన్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూస్తాం. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణ సర్వే పనుల్లో సర్వేయర్లు ఉండటంతో కాస్త ఆలస్యం జరుగుతుంది.
– కిషన్‌రావు,
సర్వే ల్యాండ్ ఏడీ, మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు.
రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు
పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న
సర్వే ల్యాండ్ అధికారులు
2 వేలకుపైగానే ఎఫ్‌లైన్ అర్జీల పెండింగ్
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు

సర్వేయర్లు కావాలె..

సర్వేయర్లు కావాలె..