
కనులపండువగా రథోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 33వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. పురవీధుల గుండా స్వామివారి రథోత్సవ ఊరేగింపు సాగింది. రథోత్సవంలో భజన మండలి కీర్తనలు అలరించాయి. రథోత్సవ ఊరేగింపులో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షుడు శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రశర్మ, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.