
ఆ ఉపాధ్యాయుడు.. ఆదర్శప్రాయుడు
బైక్‌పై పిల్లలతో ఉపాధ్యాయుడు గాజుల వెంకటేశ్
సర్కారీ బడుల్లో పిల్లలను చేర్పించాలంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్న చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు.. వారి పిల్లలను మాత్రం ప్రైవేట్‌లో చదివిస్తున్నారు. కానీ ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు గాజుల వెంకటేశ్ మాత్రం తన పిల్లలను తాను పనిచేసే పాఠశాలలోనే చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈయన నిత్యం తనతోపాటు ఇద్దరు పిల్లలను అచ్చంపేట నుంచి బైక్‌పై తీసుకొచ్చి ఇక్కడి చదివిస్తుండటంతో స్థానికుల్లో నమ్మకం ఏర్పడి తమ పిల్లలను కూడా అదే పాఠశాలకు పంపిస్తున్నారు. ఒకప్పుడు 20 మంది విద్యార్థులు కూడా లేని ఈ పాఠశాలలో ప్రస్తుతం 90 మంది ఉన్నారు. వెంకటేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ బోధిస్తుండటంతో ఐదేళ్లలో 49 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యారు. దాతల సాయంతో ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్ ఇతర పరికరాలు సమకూర్చుకొని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్‌తో పాటు కంప్యూటర్ బోధన అందిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పునాదులు వేస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేష్ కృషిని అందరూ అభినందిస్తున్నారు. – ఉప్పునుంతల
తను పనిచేసే ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివిస్తున్న వెంకటేశ్