
జనాభాలో అధికులకే అన్యాయం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జనాభా అత్యధికంగా ఉన్న బీసీలకే అన్యాయం జరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఆలిండియా ఓబీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనాభాలో అధికభాగం ఉన్నప్పటికీ వారికి రాజకీయంతోపాటు ఏరంగాల్లో కూడా న్యాయం జరగడం లేదన్నారు. 42శాతం ఉన్న బీసీలకు అదే దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హక్కులు సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. పాలమూరులో గతంలో పనిచేయడం గొప్ప అనుభూతని, ఇక్కడి ప్రజలు చాలా మంచి వారని పేర్కొన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
పీయూలో ఆలిండియా ఓబీసీ విద్యార్థుల సంఘం సెమినార్