
కలా్యణం.. కమనీయం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం కంచికామకోటి పీఠం పాలమూరు శాఖ 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణం కనులపండువగా సాగింది. వేదమంత్రోచ్చరణ మధ్య పురోహితులు ఎంతో వైభవంగా వేడుకను నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సావాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఎంపీ డీకే అరుణ స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సి.రాజేశ్వర్, నందకిషోర్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.