
ఉత్సాహంగా బాక్సింగ్ పోటీలు ప్రారంభం
● వివిధ జిల్లాల నుంచి 500కు పైగా క్రీడాకారులు హాజరు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్‌లో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నారు. ఇలాంటి పోటీలు క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తాయని అన్నారు. మొదటిసారి కిక్‌బాక్సింగ్ పోటీలకు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి మోదీ ఖేలో ఇండియా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారానే గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులు రాణిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కిక్‌బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, కోశాధికారి శ్రీనివాస్, స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమా ర్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, సలహాదారులు ఎంఎన్.విజయ్‌కుమార్, జిల్లా యోగా సంఘం అధ్యక్షులు కె.రాములు, బీజేపీ నాయకులు పాండు రంగారెడ్డి, సీనియర్ విద్యార్థులు నిఖిల్, రోహిత్, యామిని, జయదీప్‌సింగ్, వర్షిణి పాల్గొన్నారు.

ఉత్సాహంగా బాక్సింగ్ పోటీలు ప్రారంభం