
భారీగా మట్టి డంప్
జడ్చర్ల: వుండలంలోని పోలేపల్లి సెజ్ శివారులో భారీగా నిల్వచేసిన మట్టిని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వంద టిప్పర్ల మట్టిని రహస్యంగా రాజాపూర్ మండలంలోని వాగు నుంచి ఇక్కడికి తరలించినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ మట్టిని ఫిల్టర్‌చేసి ఇసుక తయారు చేసేందుకు వినియోగిస్తారని తెలిపారు.స్థానిక సీఐ కమలాకర్ మట్టి డంప్‌ను పరిశీలించి.. స్థానిక తహసీల్దార్ నర్సింగరావుకు సమాచారం ఇచ్చారు. మట్టి డంప్‌ను వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తామని తహసీల్దార్ తెలిపారు. కాగా, ఇక్కడికి మట్టి తరలించిన వారే తక్కువ ధరకు ఇసుకను వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.