
బైక్ టైర్‌లో చీర చిక్కుకొని మహిళ మృతి
కల్వకుర్తి రూరల్: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ.. ఐదు నిమిషాల్లో పట్టణంలోని ఇంటికి చేరుకునేవారు.. అంతలోనే చీరకొంగు బైక్ టైర్లో ఇరుక్కోవడంతో జరిగిన ప్రమాదంలో శ్రుతి(24) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. మండలంలోని తోటపల్లికి చెందిన శృతి తిమ్మరాశిపల్లికి చెందిన రవితో నాలుగేళ్ల కిందట ప్రేమవివాహం చేసుకున్నది. ఇద్దరు కుమారులు. గురువారం కొల్లాపూర్‌లోని బంధువుల ఇంట్లో నిర్వహించిన దినవారాలకు వెళ్లారు. సాయంత్రం కల్వకుర్తికి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణ సమీపంలోని గ్రీన్‌పార్క్ కాలనీ వద్ద బైక్ వెనకాల కూర్చున్న శృతి చీరకొంగు టైర్‌లో ఇరుక్కుపోయింది. దీంతో కింద పడిపోవడంతో తల వెనుక భాగంలో బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటూ.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచింది. బైక్‌పై ఉన్న భర్త రవి, పిల్లలకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.
రోడ్డుప్రమాదంలోమహిళ దుర్మరణం
వెల్దండ: మండల కేంద్ర సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై యెన్నమ్స్ ఆస్పత్రి వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. ఎస్‌ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదం గుర్తు తెలియని మహిళ మృతిచెందినట్లు సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలించగా మృతి చెందిన మహిళ దాదాపుగా (38) ఏళ్ల వయస్సు కల్గి ఉంటుంది. ఆకుపచ్చ జాకెట్, పసుపు రంగులో చీర ధరించి ఉంది. మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వెల్దండ పోలీస్‌స్టేషన్ సమాచారం అందించాలని పేర్కొన్నారు.
యువతి అదృశ్యం:కేసు నమోదు
మద్దూరు: మద్దూరు మున్సిపల్ పరిధిలోని నాగంపల్లికి చెందిన అఖిల (18) గురువారం నుంచి అదృశ్యమైనట్లు ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు. దౌల్తాబాద్ మండలం మొగులమ డ్కలోని అమ్మమ్మకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువతి తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. ఈ క్ర మంలో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి
మరికల్: బైక్‌పై నుంచి పడి యువకుడు మృతిచెందిన ఘటన మరికల్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పెద్దకాబ్నూర్ మండలం ఉలికంది గ్రామానికి చెందిన మస్కి తిమ్మయ్య (36) బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలోని మరికల్ సమీపానికి రాగానే బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బైక్ టైర్‌లో చీర చిక్కుకొని మహిళ మృతి