
కేఎల్‌ఐ కాల్వలో జమ్ముతో ఇబ్బందులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని కేఎల్‌ఐ కాల్వలో జమ్ము ఏపుగా పెరగడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి డీ–38 కాల్వ జొన్నలబొగుడ, సాతాపూర్, కొత్తపేట, చెన్నపురావుపల్లి, గంట్రావుపల్లి, కల్వకోలుకు సాగునీరు అందించే కాల్వలో జమ్ము ఏపుగా పెరిగి కాల్వలో నీరు నిల్వ ఉండి రైతుల పొలాలపై పారుతున్నాయి. వేసవిలో ఈ కాల్వలో సాగునీరు వదలడంతో ఉపాధి హామీ పథకంలో ఈ కాల్వలను శుభ్రం చేయలేదు. మిగతా కాల్వలను ఉపాధి హామీ సిబ్బంది జమ్ము తొలగించారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకొని కాల్వలో పేరుకుపోయిన జమ్మును జేసీబీల ద్వారా తొలగించాలని రైతులు పరశురాము, వీరయ్య కోరారు.
90 ట్రాక్టర్ల ఇసుక మాయం
బిజినేపల్లి : మండలంలోని మమ్మాయిపల్లిలో ఫిబ్రవరిలో 90 ట్రాక్టర్ల ఇసుకను గత తహసీల్దారు శ్రీరాములు సీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఇసుక కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుతున్నారు. మండలంలో ప్రస్తుతం ఇసుక లేదని, ఉంటే అనుమతులు ఇచ్చేవాళ్లని అధికారులు చెప్పుకొచ్చారు. మమ్మాయిపల్లిలో సీజ్‌చేసిన 90 ట్రాక్టర్ల ఇసుక ఉండి ఉంటే స్థానిక గ్రామాల లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పేవని అంటున్నారు. ఈ విషయమై తహసీల్దారు ఎండీ మున్నీరుద్దిన్ వివరణ కోరగా.. సీజ్ చేసిన ఇసుకను పోలీస్‌శాఖకు అప్పగించామని, తమకేమీ సంబంధం లేదన్నారు.

కేఎల్‌ఐ కాల్వలో జమ్ముతో ఇబ్బందులు