
రిజర్వాయర్ పనుల్లో జాప్యమెందుకు?
వెల్దండ: పూర్వపు మండలంలోని ఎర్రవల్లి, గోకారం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ పనుల్లో జాప్యమెందుకు జరుగుతోందని రాష్ట్ర భూ నిర్వాసితుల పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్‌ను సందర్శించి అధికారులతో మాట్లాడి భూములు కోల్పోతున్న రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు అందిన పరిహారం, బకాయిల వివరాలు అధికారులు కమిషనర్‌కు వివరించారు. పనుల్లో వేగం పెంచాలని.. బకాయి పరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు. వెంటనే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, నీటిపారుదలశాఖ ఈఈ కుమార్, వెల్దండ, చారగొండ తహసీల్దార్లు కార్తీక్‌కుమార్, సునీత, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, కాంట్రాక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.