
రాష్ట్రస్థాయి టోర్నీలో చాంపియన్‌గా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌పీ.వెంకటేశ్ అన్నారు. నిజామాబాద్‌లో నేటి (శనివారం) నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు శుక్రవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఎన్‌పీ వెంకటేశ్ అభినందించారు. ఫుట్‌బాల్‌లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నత స్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్యాట్రన్ రంగారావు, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ జేమ్స్, సభ్యులు నందకిషోర్, సూర్యప్రకాశ్, రాజేందర్, ఖేలో ఇండియా మహబూబ్‌నగర్ ఫుట్‌బాల్ కోచ్ నికేష్ పాల్గొన్నారు.
జిల్లా జూనియర్ ఫుట్‌బాల్ జట్టు: కల్మూరి వంశీకృష్ణ, కొండపల్లి అభిరాం, కొండపల్లి సాయితేజ, జి.వంశీకృష్ణ, జర్పలావత్ ధ్యానవర్ధన్ నాయక్, మహ్మద్ అమాన్, జె.శివ, ఎం.రాఘవేందర్, బండి నవతేజ్, ఎండీ సుబాన్, ఎల్.కృపదాస్, కాట్రావత్ చరణ్, మహ్మద్ మజైన్ సదిమ్, మహ్మద్ ఖాజామైనద్దీన్, ఎం.చరణ్, మహ్మద్ అబ్దుల్ మతిన్, ఎండీ అబ్రార్ షరీఫ్, అనస్ తార.
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ.వెంకటేశ్
నిజామాబాద్ తరలిన బాలుర ఫుట్‌బాల్ జట్టు