
‘రాచాల’ వాహనంపై దాడి
కొత్తకోట రూరల్: బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ కథనం మేరకు.. యుగంధర్‌గౌడ్ వనపర్తి నుంచి స్వగ్రామం కొత్తకోట మండలం వడ్డెవాటకు తన కారులో వెళ్తుండగా గ్రామ సమీపంలోని భీమా ఫేస్–2 కాల్వ సమీపంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చిన వాహనాన్ని అడ్డగించారు. కారు డ్రైవర్ రాజు చాకచక్యంగా వ్యవహరించడంతో దుండగులు అద్దాలు ధ్వంసం చేసి పారిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి తనకు రక్షణ కల్పించాలని యుగంధర్‌గౌడ్ కోరారు.
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
కల్వకుర్తి రోడ్డు: మండలంలోని కురుమిద్దలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి పాడిఆవు మృతిచెందింది. గ్రామానికి చెందిన కాలె మల్లయ్యకు చెందిన ఆవు వ్యవసాయ పొలంలో మేత మేస్తున్న క్రమంలో సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ తీగ తగిలి అక్కడిక్కడే చనిపోయింది. దాదాపు రూ 1,20,000 నష్టం వాటిళ్లిందని, తనను ఆదుకోవాలని రైతు మల్లయ్య కోరారు.

‘రాచాల’ వాహనంపై దాడి