
ఒడిశా టు పాలమూరు.. గంజాయి సరఫరా
మహబూబ్‌నగర్ క్రైం: ఒడిశా నుంచి పాలమూరుకు గంజాయి సరఫరా అవుతోంది. శుక్రవారం ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఎకై ్సజ్ పోలీసుల వివరాల మేరకు.. ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మయూరీ పార్క్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సంతోష్‌కుమార్‌గౌడ్, రూడావత్ రవికాంత్ అనే ఇద్దరు యువకులు వంద గ్రాముల ఎండు గంజాయితో బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్నారు. అయితే సదరు యువకులను పోలీసులు విచారించగా.. నక్కలబండ ప్రాంతంలో ఒడిశాకు చెందిన చందన్ మహాంత అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో నక్కలబండ ప్రాంతానికి ఎకై ్సజ్ పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా.. సదరు వ్యక్తి వద్ద మరో 300 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. నక్కలబండ వద్ద చేపట్టిన టన్నెల్ నిర్మాణంలో చందన్ మహాంత రోజు కూలీగా పని చేయడంతో పాటు ఒడిశా నుంచి ఎండు గంజాయి తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తుల ద్వారా జిల్లా కేంద్రంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. మొత్తం 400 గ్రాముల ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
400 గ్రాముల ఎండు గంజాయి సీజ్