
తేజేశ్వర్‌ను హత్య చేసిన దుండగులను శిక్షించాలి
గద్వాలటౌన్: సర్వేయర్ తేజేశ్వర్‌ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్ ఫోరం, వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక స్మృతివనంలో తేజేశ్వర్ చిత్రపటానికి నివాళులర్పించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు కఠిన శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. మాధవి, అరుణ, రాములు, కుర్వ పల్లయ్య, సలాం, తేజేశ్వర్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, తేజవర్ధన్, రమాదేవి, మహేందర్ పాల్గొన్నారు.