
యోగా సాధనతో ఒత్తిడి దూరం
ధన్వాడ: యోగా సాధనతో ఒత్తిడి దూరమవుతుందని డీఎంహెచ్‌ఓ జయచంద్ర మోహన్ అన్నారు. గురువారం రాత్రి కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో నిద్ర చేసిన ఆయన శుక్రవారం తెల్లవారు జామున విద్యార్థులకు యోగా ఆసనాలపై అవగాహన కల్పించారు. స్వయంగా ఆయన వివిధ ఆసనాలను ప్రదర్శించారు. యోగా ప్రాధాన్యత, పౌష్టికాహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపల్ రాజారాంతో కలిపి ఔషధ మొక్కలను నాటారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రైమర్ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని త్వరగా వైద్యాశాఖకు అప్పజెప్పలని కాంట్రాక్టర్‌కు సూచించారు.