
బాధితులకు భరోసాగా నిలవాలి : ఎస్పీ
మిడ్జిల్: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి పోలీసు సిబ్బందికి సూఇచంచారు. శుక్రవారం మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా విచారించి.. శిక్షల శాతం పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్ అమలు తీరు, పైళ్ల నిర్వహణ పద్ధతులపై దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్ ఉన్నారు.