
నేడు, రేపు రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కృష్ణారెడ్డి గార్డెన్స్‌లో శని, ఆదివారం రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమార్ తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని దాదాపు 22 జిల్లాల నుంచి 600 మందిక పైగా బాక్సర్లు, 36 మంది రెఫరీలు హాజరవుతారని పేర్కొన్నారు. నాలుగు సింథటిక్ తతామిల్లో (కోర్టులు) బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు. 4 నుంచి 40 ఏళ్ల లోపు వారికి వెయిట్ కేటగిరీల ప్రకారం పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. విజేతగా నిలిచిన బాక్సర్లకు బంగారు పతకాలు ఇవ్వడంతో పాటు త్వరలో జరగనున్న జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలకు ఎంపికవుతారని చెప్పారు. పోటీల్లో పాల్గొనే బాలురకు క్రీస్తూ జ్యోతి హైస్కూల్, ఫాతిమా ఉన్నత పాఠశాలల్లో బాలికలకు మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్‌లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పోటీలు జరిగే ప్రదేశంలో భోజన వసతి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 29న పోటీల ముగింపు కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్‌లు అందజేస్తారని తెలిపారు.
హాజరుకానున్న 600కు పైగా విద్యార్థులు