
ఉత్సాహంగా జిల్లాస్థాయి ‘స్పోర్ట్స్ స్కూల్’ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం గురువారం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బాలబాలికలు హాజరయ్యారు. విద్యార్థుల పేర్లు నమోదు చేయడంతో పాటు ఎంపికల్లో పొందుపరిచిన విధంగా వయసు నిర్ధారణ ధ్రువీకరణ, ఇతర పత్రాలను పరిశీలించారు. ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్‌త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, 6X10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ పర్యవేక్షించారు. జిల్లాస్థాయి ఎంపికల ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థులు హైదరాబాద్‌లో వచ్చేనెల 4, 5 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో శాట్ పరిశీలకుడు కె.సైదులు, సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, కోచ్‌లు సునీల్‌కుమార్, ఎండీ ఖలీల్, పర్వేజ్‌పాష, నికేష్, అంజద్, మల్లేష్, కంప్యూటర్ ఆపరేటర్ ఉమేష్‌కుమార్, నరేష్ పాల్గొన్నారు.