
భూమి అక్రమంగా విరాసత్ చేశారని..
ఉండవెల్లి: ‘‘మా చిన్నాన్నను చిన్నమ్మ వదిలిపెట్టి వెళ్తే నేనే సేవచేశా.. అందుకు ఆయన కృతజ్ఞతగా తన పేరుపై ఉన్న భూమిని నాకు రాసిచ్చారు.. ఆ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. తీరా రెవెన్యూ కార్యాలయంలో మా చిన్నమ్మ పేరుపై అక్రమంగా విరాసత్ చేశారు.. నాకు చేయండి.’’ అంటూ ఓ మహిళ ఉండవెల్లి తహసీ ల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొ ని ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథ నం మేరకు.. ఉండవెల్లికి చెందిన మదర్సాబ్‌కు కంచుపాడు గ్రామ శివారులో 1.38 ఎకరాల ఇనా మ్ భూమి ఉంది. అతడిని భార్య ఖాజాబి కొన్నేళ్ల క్రితం వదిలిపెట్టి వెళ్లిపోయింది. వారికి సంతానం లేకపోవడంతో వృద్ధాప్యంలో మదర్సాబ్ బాగోగులను అతడి అన్న కూతుళ్లు రిజ్వాన, రిహానా చూశారు. అందుకు ప్రతిఫలంగా మదర్సాబ్ తన పేరుపై ఉన్న భూమిని వారికి రాసిచ్చాడు. అతడు 2023లో మృతిచెందగా.. సదరు భూమిపై కోర్టు లో కేసు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మదర్సాబ్ భార్య ఖాజాబి పేరుపై అధికారులు విరా సత్ చేశారు. ఈ విషయంపై బాధితురాలు తహసీల్దార్ ప్రభాకర్‌ను ప్రశ్నించారు. తన కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నా రు. గమనించిన రెవెన్యూ సిబ్బందిని ఆమెను అడ్డుకొని కార్యాలయంలో నుంచి బయటికి పంపించారు. అయితే బాధిత మహిళ తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు ది గింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శేఖర్ అక్క డికి చేరుకొని ఆమెకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించింది. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. భూ వివాదం కోర్టులో ఉన్న విషయం తమకు తెలియదన్నారు. తమకు ప్రొసీడింగ్ ఇవ్వడంతో విరాసత్ చేసినట్లు చెప్పారు.
పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన
అడ్డుకున్న ఉండవెల్లి రెవెన్యూ సిబ్బంది

భూమి అక్రమంగా విరాసత్ చేశారని..