
నిర్వాసితులకు అండగా ఉంటా
చారకొండ: మండలంలని సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి దేవాలయం స్థలంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటానని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సిర్సనగండ్లలో బాధితులను ఆయన కలిసి ఓదార్చారు. కూల్చిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదాయ శాఖ సంబంధిత అధికారులు కోర్టుకెళ్లడంతో కోర్టు ఉత్వర్వుల మేరకు ఇళ్లు కూల్చారని వివరించారు. కాని కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. ఇళ్లు కోల్పోయిన వారందరికి స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలో నిర్వాసితులకు స్థలాలు మంజూరు చేయాలని తహసీల్దార్ సునీతకు సూచించారు. సిర్సనగండ్ల శివారులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. అంతకుముందు గుట్టపై సీతారామచంద్రాస్వామి స్వాములవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, బాక్ల్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, వెంకట్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గుర్వయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రాం గౌడ్, మాజీ సర్పంచ్ ప్రశాంత్ నాయక్, మాజీ జెడ్పీటీసీ భీముడు నాయక్, డీసీసీ కార్యదర్శి మహేదంర్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జైపాల్, మాజీ ఎంపీటీసీ నర్సింహరెడ్డి, నాయకులు సందీప్‌రెడ్డి, శ్రీపతి రావు, వెంకటయ్య గౌడ్, నాగేంద్ర, అంజయ్య, అధికారులు తదితరులు ఉన్నారు.