
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
దోమలపెంట: హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారిలో గురువారం ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటన దోమలపెంటలో చోటుచేసుకుంది. ఈగలపెంట ఏఎస్‌ఐ బాలునాయక్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా జనగాం కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జనగాం నుంచి శ్రీశైలానికి వస్తుండగా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంటలో శ్రీశైలం ప్రధాన రహదారిలో బ్రేకులు ఫెలయి బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ సమయంలో డ్రైవర్ తుమ్మల సురేష్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. బస్సులో 11 మంది చిన్నారులతో సహ 40 మంది ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను కటకం రాములమ్మ ఫౌండేషన్ అంబులెన్స్‌లో జెన్‌కో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బస్సు ఓ కారును సైతం ఢీకొట్టడంతో కారు వెనక అద్దాలు ధ్వంసమయ్యాయి. రోడ్డు దాటుతున్న ఓ ఆవుకు సైతం తగలడంతో దానికి స్పల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.