
రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నల్లమల బిడ్డ
కందనూలు: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా అచ్చంపేట నియోజకవర్గం పదర గ్రామానికి చెందిన నందిని ఎంపికై నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి జూలై 1వ తేదీ వరకు హరిద్వార్‌లో నిర్వహించే అండర్–18 జాతీయస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారిణి నందిని తెలంగాణ జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడంపై డీవైఎస్‌ఓ సీతారాం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ కబడ్డీ పోటీలకు అరవింద్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈనెల 28 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు జరగనున్న మొదటి జాతీయస్థాయి అండర్–18 కబడ్డీ టోర్నమెంట్ జిల్లా లోని బాలానగర్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన అరవింద్ ఎంపికయ్యాడు. తొలిసారిగా జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాడు. అరవింద్ ఎంపికపై జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.శాంతికుమార్, కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు దామోదర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు.
వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు..
వనపర్తి టౌన్: హైదరాబాద్‌లోని కాసాని వీరేశం అకాడమీ క్యాంపులో శిక్షణ పొందుతున్న పిల్లిగుండ్ల తండాకు చెందిన అనూషతో పాటు మూలమల్ల గ్రామానికి చెందిన అంజి జాతీయస్థాయి కబడ్డీ జట్లుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని వనపర్తి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నల్లమల బిడ్డ

రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నల్లమల బిడ్డ