
క్రీడా స్కూళ్లకు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయిలో సెలక్షన్స్ సందడి నెలకొంది. త్వరలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరగనున్నాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్‌ఎస్ హకీంపేటతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి స్కూల్‌లో 4వ తరగతిలో 20మంది బాలుర, 20మంది బాలికలను ఎంపిక చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో సందడి
ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ సందడి నెలకొంది. నాగర్‌కర్నూల్ పట్టణంలో మంగళవారం, వనపర్తి పట్టణంలో బుధవారం జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించారు. గురువారం మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లా కేంద్రాల్లో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై నవారు వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌కు వెళ్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచినవారు ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాలు పొందుతారు. గతేడాది ఉమ్మడి జిల్లా నుంచి 29మంది విద్యార్థులు ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాలు పొందగా.. నారాయణపేట జిల్లా నుంచి అధికంగా 14మంది ఎంపిక కావడం విశేషం.
శారీరక సామర్థ్య పరీక్షలు
● విద్యార్థులకు వివిధ అంశాల్లో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
● ఎత్తు, బరువు, 30మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800మీటర్ల, 610 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్.
నాగర్‌కర్నూల్, వనపర్తి
జిల్లాస్థాయిలో పూర్తి
నేడు పాలమూరు, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో..
వచ్చేనెలలో రాష్ట్రస్థాయిలో ఎంపికలు
కావాల్సిన ధ్రువవపత్రాలు
స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలకు విద్యార్థులు పలు ధ్రువీకరణ పత్రాలతో రావాలి. ఒరిజినల్ ఆధార్‌కార్డు, 4వ తరగతి చదువుతున్న సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం (పాఠశాల నుంచి తహసీల్దార్/మున్సిపాలిటీ), 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, పది పాస్‌ఫొటోలు, విద్యార్థులు 8నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య పుట్టినవారు అర్హులు.

క్రీడా స్కూళ్లకు ఎంపికలు