
జూరాలకు పెరిగిన వరద ఉధృతి
ధరూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద మరింత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 43 వేల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం సాయంత్రానికి 92 వేల క్యూసెక్కులకు చేరిందని వివరించారు. దీంతో 13 క్రస్ట్ గేట్లు పైకెత్తి 51,779 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నామన్నారు. విద్యుదుత్పత్తికి 32,169 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 650, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 298, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.010 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
13 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు
నీటి విడుదల