
తీవ్రంగా ఖండిస్తున్నాం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చేనెల 15 వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఇవ్వకూడదు. ఆ తేదీ తర్వాత సర్దుబా టులో భాగంగా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ డిప్యుటేషన్లు ఇవ్వలేదు. కానీ, మహబూబ్‌నగర్ డీఈఓ అక్రమ డిప్యూటేషన్లకు తెరలేపారు. డీఈఓ డిప్యుటేషన్లు ఇవ్వడంతో చాలామంది ఉపాధ్యాయులు క్యూ కడుతున్నారు. డిప్యూటేషన్లు అక్రమమని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో డీఈఓ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – వెంకటేష్,
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆర్డర్ రద్దు చేస్తాం..
గాజులపేట పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటు కోసం ఉపాధ్యాయురాలికి ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేస్తాం. ఎర్రవల్లిలో పనిచేసే ఉపాధ్యాయురాలికి ఓరాల్ డిప్యుటేషన్ ఇచ్చాం. ఆమెను కూడా వెనక్కి పంపిస్తాం. ఓ ఉపాధ్యాయుడికి జీహెచ్‌ఎంగా వడ్డేమాన్‌లో ప్రమోషన్ వస్తే తాటికొండలో పోస్టింగ్ ఇస్తూ ఆర్జేడీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇందులో నా ప్రమేయం లేదు. మా దృష్టి వస్తే ఈ విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అనారోగ్యంతో ఉన్న ముగ్గురికి ఓరాల్ డిప్యుటేషన్ ఇచ్చాం. అక్రమ డిప్యుటేషన్లు ఇచ్చినట్లు తెలి స్తే తప్పకుండా వాటిని కూడా రద్దు చేస్తాం.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ
●

తీవ్రంగా ఖండిస్తున్నాం..