
అందరూ సమన్వయంతో పనిచేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్‌గా టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయ వనరులపై ఆరా తీశారు. అందరూ సమన్వయంతో, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా నగరంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని సూచించారు. అంతకుముందు ఆయా విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వద్దకు ఆయన నేరుగా వెళ్లి క్షుణ్ణంగా పనిశీలించారు. కాగా ఇన్‌చార్జ్ ఎంఈ సందీప్‌వరల్డ్, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఏసీపీ కరుణాకర్‌గౌడ్, టీపీఓ లక్ష్మీపతి, ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా, ఆర్‌ఐలు అహ్మద్‌షరీష్, రమేష్, టి.నర్సింహులు, ముజీబుద్దీన్, ఏఎస్‌ఓ సలీం, మెప్మా ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు యాదయ్య, నిర్మల, దేవమ్మ, వరలక్ష్మి తదితరులు వేర్వేరుగా కొత్త కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు.
కొత్త కమిషనర్ ప్రవీణ్‌కుమార్
బాధ్యతల స్వీకరణ