
సాకులు చెబుతున్నారు..
నాకు 2.32 ఎకరాల పట్టా భూమి ఉంది. ఎకరాకు మాత్రమే రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మిగతా 1.32 ఎకరాలకు పడలేదు. గత సీజన్‌లో భూమి మొత్తానికి రైతు భరోసా పడింది. వ్యవసాయ అధికారిని అడిగితే కాస్తు చేయలేదని సాకులు చెబుతున్నారు. నాకున్న భూమిలో కందులు వేశాం. రైతు భరోసా కోసం కాస్తు నమోదు చేయడంలో అధికారులు తప్పుడు నివేదికల కారణంగా నష్టపోయాం. – చంద్రప్ప, రైతు,
వింజమూరు, కోయిలకొండ మండలం
రెండెకరాలకే వచ్చాయి..
ఈసారి కాస్తు విస్తీర్ణాన్ని తగ్గించి రైతు భరోసా వేశారు. నాకు 4.14 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో కేవలం రెండెకరాలకు రైతుభరోసా డబ్బు లు నా ఖాతాలో జమయ్యా యి. మిగతా 2.14 ఎకరాల భూమికి డబ్బులు పడలేదు. నాకున్న మొత్తం విస్తీర్ణంలో కందులు వేశాం. సర్వే నిర్వహించి మాకు న్యాయం చేయాలి.
– బాలకిష్టయ్య, రైతు, వింజమూరు, కోయిలకొండ

సాకులు చెబుతున్నారు..