
అటవీశాఖ అధికారులకు నెమలి అప్పగింత
పాన్‌గల్: అటవీశాఖ అధికారులకు జాతీయపక్షి నెమలిని అప్పగించిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యేక సాక్షులు, అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. పాన్‌గల్ సమీపంలో గుట్ట నుంచి నెమలి వచ్చి రాధాకృష్ణ ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయం ఇంటి యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తమ సిబ్బందింతో వచ్చి నెమలిని తీసు కెళ్లారు. గుట్ట నుంచి వచ్చిన నెమలిని సురక్షితంగా అటవీశాఖ అధికారులకు అప్పగించడంతో ఇంటి యజమాని రాధాకృష్ణను అటవీశాఖ అధికారులు అభినందించారు.
మొసలి కలకలం
మాగనూర్: మండల కేంద్రంలోని సమన్‌చెరువు (సబ్‌స్టేన్ స్టేషన్ పక్కన గల చెరువు)లో కొన్ని రోజులుగా వమొసలి కలకలం సృష్టిస్తోంది. ప్రతిరోజు మొసలి గట్టు మీద వస్తుందని, దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. గతంలో ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్ని వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఫారెస్టు అధికారులు మొసలిని బంధించి తరలించాలని కోరుతున్నారు.
నల్లమలలో గొర్రెల కాపరి అదృశ్యం
మన్ననూర్: నాగర్‌కర్నూల్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గంగెడ్ల బాలయ్య మంగళవారం నల్లమల అటవీ సరిహద్దు ప్రాంతం కుడిచింతలబైలు గ్రామం సమీప అడవిలో తప్పి పోయినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. కొంతమంది గొర్రెల కాపరులు కొన్ని రోజుల నుంచి కుడిచింతలబైలు గ్రామం సమీపంలోని రేవువాగు సమీపంలో గొర్రెలను మేపుతున్నారు.
ఈ క్రమంలో అప్పుడప్పుడు వారికి కావాల్సిన వస్తువులు, నిత్యవసరాలు తదితరాల కోసం గ్రామానికి వస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన బాలయ్య మద్యం తాగి గొర్రెల మంద వద్దకు తిరిగి వెళ్లాడు. రాత్రి ఎంతకూ తిరిగి మంద వద్దకు చేరుకోకపోవడంతో తోటి గొర్రెల కాపరులు తెల్లవారుజామున కుడిచింతలబైలుకు గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల సహయంతో రోజంతా అడవిలో వెతికిన బాలయ్య జాడ దొరలేదని తెలిపారు.

మొసలి కలకలం