కొత్తపల్లి: కడుపునొప్పి బరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తపల్లి మండలంలోని దుప్పడి గట్టులో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుప్పడిగట్టు గ్రామానికి చెందిన వేపూర్ గోపాల్ (42) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కడుపునొప్పి వచ్చినప్పుడు ఆర్‌ఎంపీలతో చూపించుకొని మందులు వాడేవారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున రోజువారిగా పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో మరోమారు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో భరించలేక మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పొలానికి వెళ్లిన గోపాల్ ఇంటిక రాకపోవడంతో భార్య సత్యమ్మ కొడుకును పంపింది. పొలం వద్ద చెట్టుకు వేలాడుతున్న తండ్రిని చూసి వెంటనే వెళ్లి తల్లికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి గోపాల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిర్వహించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
భూత్పూర్: మండలంలోని పాతమొల్గరకు చెందిన నవీన్‌గౌడ్ (22) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం.. నవీన్‌గౌడ్ ఖిల్లాగణపురం, కొత్తకోటలోని వైన్స్ దుకాణాల్లో పనిచేస్తుండేవాడు. వైన్స్ దుకాణంలోని డబ్బుల లావాదేవీల కారణంగా ఒత్తిడికి తట్టుకోలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని మృతిచెందాడు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
చెట్టు పైనుంచి పడిబాలుడికి గాయాలు
గండేడ్: చెట్టు పైనుంచి పడి ఓ బాలుడు గాయాల పాలైన ఘటన మండలంలోని సల్కర్‌పేట్‌లో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నవీన్ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సీతాఫలం చెట్టుకున్న పండ్లను తెంచడానికి పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో కాలికి గాయం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో స్థానిక ఆస్పత్రి అటు నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చైన్ స్నాచర్ అరెస్ట్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రైల్వే స్టేషన్లు, నడుస్తున్న రైళ్లలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దొంగ రితేష్ హరిశ్చంద్ర ధోత్రేను మంగళవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మత్కులి గ్రామానికి చెందిన ధోత్రే పలు చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడి దొరకకుండా తిరుగుతున్నాడు. మంగళవారం మన్యంకొండ రైల్వేస్టేషన్‌న్‌కు వెళ్లి తనిఖీలు చేస్తుండగా సమీపంలో అనుమానాస్పదకంగా తిరుగుతున్న ఐదుగురిని గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా నలుగురు తప్పించుకున్నారు. ఏ5గా ఉన్న ధోత్రేను అరెస్టు చేయడంతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మన్యంకొండ, కౌకుంట్ల, ఇటిక్యాల, మనవపాడు, అలంపూర్ రైల్వేస్టేషన్, అలాగే కర్నూలు, గుత్తి, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలు చేశాడని రైల్వే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాజు వివరించారు.

ఉరేసుకొని రైతు బలవన్మరణం