
నల్లమల అడవిలోకి కొండచిలువ
మన్ననూర్: వనపర్తి జిల్లా గోపాల్‌పేట పరిసర ప్రాంతంలో బంధించిన 13 అడుగుల కొండ చిలువను నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో మంగళవారం వదిలారు. వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం గోపాల్‌పేట మండల కేంద్రంలో అవుసలకుంటలో భారీ కొండచిలువను సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ బంధించాడు. కొండచిలువను సురక్షితంగా వదిలేయానే క్రమంలో సంబంధిత డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డిని సంప్రదించారు. దీంతో స్పందించిన ఆయన శ్రీశైలం ప్రధాన రహదారి సమీపంలోని నల్లమల అడవిలోకి తీసుకొచ్చి వదిలేయాలని సూచించారు. దీంతో కొండచిలువను ఓ ప్రత్యేక వాహనంలో తరలించి మద్దిమడుగు ఎఫ్‌ఆర్‌ఓ మహేందర్, మన్ననూర్ సెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్, బీట్ ఆఫీసర్ ఆనంద్, శివ సమక్షంలో పిచ్చకుంట్ల చెరువు నల్లమల అటవీ పరిసర ప్రాంతంలో వదిలేశారు. సకాలంలో స్పందించిన డీఎఫ్‌ఓకు కృష్ణసాగర్‌తో పాటు సొసైటీ సభ్యులు గోవర్ధన్, విష్ణుసాగర్, ఆనంద్, నాగరాజు, సురేష్, ప్రకాష్ రాజు, సూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.