
హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థి
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో ఉన్న కేజీబీవీ హాస్టల్ భవనం పైనుంచి ఓ విద్యార్థిని దూకగా వెన్నుముకకు తీవ్ర గాయామైన ఘటన మంగళవారం చోటు చేసుకున్నట్లు ప్రిన్స్‌పాల్ లోహిత తెలిపారు. ఆమె కథనం మేరకు.. మండలంలోని కిష్టగిరికి చెందిన గొల్ల సంజీవ్ కుమార్తె తరుణి వారం కిందట కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో చేరింది. హాస్టల్‌లో ఉండి చదవడం ఆమెకు ఇష్టం లేక మూడురోజులుగా బాధపడుతుండటంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు సకాలంలో రాకపోవడంతో ఇంటికి పారిపోవాలని నిర్ణయించుకొని మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనం పైనుంచి కిందకు దూకింది. వెనుముకకు గాయం కాగా నొప్పితో అరువగా వాచ్‌మెన్, ఉపాధ్యాయురాలు అక్కడికి చేరుకొని ఎస్‌ఓకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే సిబ్బందితో కలిసి బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. డీఈఓ అబ్దుల్ ఘని, జీసీడీఓ శుభలక్ష్మి ఆస్పత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
వెన్నెముకకు గాయం

హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థి