
పదకొండేళ్లు సాఫ్ట్‌గా..!
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం రాణిపేటకు చెందిన జక్కా కిరణ్‌కుమార్ సాఫ్ట్‌బాల్ క్రీడలో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. తండ్రి చిన్న బీరయ్య ఆర్టీసీ ఉద్యోగి, తల్లి రాములమ్మ. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉన్న కిరణ్‌కుమార్ సాఫ్ట్‌బాల్ క్రీడను ఎంచుకొని రాణిస్తున్నాడు. 11ఏళ్ల నుంచి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు పలుమార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వివిధ విభాగాల్లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణం, రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాడు.
2016లో మొదటి నేషనల్
కిరణ్‌కుమార్ దాదాపు 20సార్లు రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. 2016 సంవత్సరంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం దుర్గ్‌లో జరిగిన జాతీయ స్థాయి నేషనల్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో మొదటిసారిగా పాల్గొన్నాడు. 2017లో హైదరాబాద్, చత్తీస్‌ఘడ్ దుర్గ్, 2018 గుజరాత్‌లో జరిగిన జూనియర్ నేషనల్‌లో ఆడాడు. 2022లో ఏపీలోని అనంతపూర్‌లో జరిగిన జాతీయ సీనియర్, గుంటూర్‌లో జరిగిన సీనియర్ సౌత్‌జోన్ సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2023లో జమ్మూకశ్మీర్(జమ్ము)లో జరిగిన సీనియర్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఆలిండియా ఇంటర్ జోనల్ నేషనల్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడగా.. జట్టు ప్రథమ స్థానంలో నిలవడంతో కిరణ్‌కుమార్ బంగారు పతకం సాధించాడు. 2024లో మెదక్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి ఉత్తమ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.
బ్యాంకాక్ టోర్నీలో ప్రాతినిధ్యం
థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈనెల 2వ తేదీనుంచి 5వరకు జరిగిన 2వ అండర్–23 పురుషుల సాఫ్ట్‌బాల్ ఏషియా కప్– 2025లో కిరణ్‌కుమార్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈటోర్నీకి ముందు మహారాష్ట జలాగం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన సెలక్షన్స్ ట్రయల్స్, కోచింగ్ క్యాంపునకు ఎంపికై ఏషియా కప్‌లో పాల్గొనే తుది భారత జట్టుకు ఎంపికయ్యాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఏషియా కప్‌లో కిరణ్‌కుమార్ ఐదు మ్యాచులకు హాంకాంగ్–చైనా, సింగపూర్, థాయిలాండ్ జట్లతో భారత జట్టు తరఫున ఆడాడు.
అంతర్జాతీయ స్థాయికి రాణిపేట యువకుడు
సాఫ్ట్‌బాల్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్తమ ప్రతిభ
బ్యాంకాక్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం
వివిధ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాల సాధన
ఒలింపిక్స్‌లో ఆడడమే లక్ష్యం
2027 ఒలింపిక్స్‌లో సాఫ్ట్‌బాల్ క్రీడకు చోటు దక్కింది. ఈ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న. అందుకు రెగ్యులర్‌గా సాధన చేస్తున్న. బ్యాంకాక్‌లో జరిగిన ఏషియా కప్‌లో దేశం తరఫున ఆడినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది.
– కిరణ్‌కుమార్, అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడు, మహబూబ్‌నగర్

పదకొండేళ్లు సాఫ్ట్‌గా..!