
చేతకాని హామీలతో కాంగ్రెస్ మోసం
మహబూబ్‌నగర్ రూరల్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతగాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం మండలంలోని మాచన్‌పల్లిలో ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్ల విజయోత్సవాల్లో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. సభకు ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై బలిదాన్ దివస్‌లో భాగంగా డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వికసిత్ సంకల్పానికి మేము సహకరిస్తామంటూ సభలో పార్టీ కార్యకర్తలతో నల్గొండ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జితేందర్‌కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. పాలమూరు వాస్తవాలను ప్రజలకు చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేకున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేంద్రం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కుటుంబంలోని ప్రతి మహిళకు రూ.2500, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ రూ.4వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పాలమూరు ఎంపీగా పేదలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ప్రఽభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులు పాండురంగారెడ్డి, జయశ్రీ, అంజయ్య, మీడియా సెల్ కన్వీనర్ సతీశ్‌కుమార్, బీజేపీ మండలాధ్యక్షుడు గంగన్న, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు ఎంపీ డీకే అరుణ
మాచన్‌పల్లిలో వికసిత్ భారత్ సంకల్పసభ