
జూరాలకు 45వేల క్యూసెక్కులు
ధరూరు, ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో కొన్ని రోజులుగా వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 53వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 7:30 గంటల వరకు ఇన్‌ఫ్లో 45వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా 12, 246 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో సోమవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు తెలిపారు. ఎగువ జూరాలలో ఐదు యూనిట్ల ద్వారా 50.971 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 107.266 ఎంయూ విద్యుదుత్పత్తి చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36, 340 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 46 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 850 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు, ప్రాజెక్టు నుంచి మొత్తం 51,957 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.710 టీఎంసీల నిల్వ ఉన్నట్లు తెలిపారు.
మూడు క్రస్ట్ గేట్లు ఎత్తి 51,957 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో
జల విద్యుత్ కేంద్రంలో 11యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి