
సాగుపై సందిగ్ధం..
గత వానాకాలంలో బోనస్ సకాలంలో చెల్లించినప్పటికీ యాసంగికి సంబంధించి మాత్రం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యి నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడం లేదు. దీంతో సన్నాల సాగుపై రైతులు సందిగ్ధంలో పడుతున్నారు. సన్నరకం వరి సాగు చేస్తే దిగుబడులు తక్కువగా వస్తున్నప్పటికీ ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో ఆ పంట వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో యాసంగిలో పెద్ద మొత్తంలోనే రైతులు సన్నాలను సాగు చేశారు. కానీ, ప్రభుత్వం ప్రకటించిన విధంగా బోనస్ చెల్లించకపోవడంతో రైతులు ఈ సీజన్‌లో సన్నాలు సాగు చేయాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఈ సీజన్‌లోనూ సన్నరకం ధాన్యానికి బోనస్ అమలు చేస్తుందా.. లేదా అని అయోమయానికి గురవుతున్నారు.