
చేతబడి ఘటనపై విచారణ
తిమ్మాజిపేట: మండలంలోని చేగుంట గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న చేతబడి ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన ఓ చేతబడి చేశాడని చెప్పులు మెడలో వేసి గ్రామంలో ఊరేగించారని ‘సాక్షి’లో ఆదివారం వార్త ప్రచురితమైంది. ఈ విషయమై ఎస్‌ఐ స్పందిస్తూ బాధితులతో మాట్లాడుతున్నామని, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఈ సంఘటనలో ఇద్దరూ వృద్ధులే కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిటకు చెందిన ఎండీ రవూఫ్ (47) ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల వద్ద డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. శనివారం పనులు ముగించుకొని రాత్రి వేళ స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. బాదేపల్లిలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రవూఫ్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి.. అటు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
మిషన్ భగీరథ నీటిలో
పురుగులు
అమరచింత: మండలంలోని నందిమళ్ల లో మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిలో ఆదివారం పురుగులు రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు వస్తున్నాయన్న విషయాన్ని మిషన్ భగీరథ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకులను వారానికోసారి శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమవుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోనూ ఓవర్ హెడ్ ట్యాంకుల ను మూడు నెలలకోసారి శుభ్రపరిచే వారేలేర ని ఆరోపిస్తున్నారు.అధికారులు స్పందించి స మస్య పరిష్కరించాలని ప్రజలు కోరారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
తిమ్మాజిపేట: బైక్ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలైన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. బిజినేపల్లి మండలం ఖానాపూర్ కి చెందిన ఊషన్న మండల కేంద్రం సమీపంలో నడుచు కుంటూ వెళ్తున్నాడు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో కోడుపర్తికి చెందిన వెంకటయ్య బైక్‌పై వెళ్తూ ఊషన్నను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఊషన్నకు తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి భార్య చిన్న మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.