
13 అడుగుల కొండచిలువ పట్టివేత
గోపాల్‌పేట: ఐదడుగుల పొడవున్న ఉడుమును కొండ చిలువ మింగి కక్కేసిన ఘటన గోపాల్‌పేట మండలం ఔసులకుంట సమీపంలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి సమీపంలోని రేకులగడ్డ కాలనీ సమీపంలోని ఔసులకుంట వద్ద 13 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఉడుమును మింగుతుండగా స్థానికులు గమనించారు. అనంతరం స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా స్పందించిన కృష్ణసాగర్ సిబ్బందితో కలిసి కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. అప్పటికే కొండ చిలువ ఉడుమును మింగి బయటికి కక్కడంతో ఉడుము చనిపోయింది. అనంతరం కొండచిలువను బంధించారు. విషసర్పాలు, అటవీ జంతువుతో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో స్నేక్ సొసైటీ సభ్యులు కుమార్‌సాగర్, అవినాష్, కుమ్మరి బాలస్వామి, బిక్షపతి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉడుమును మింగికక్కిన వైనం