భూసంస్కరణలు చేపట్టి భూములు పంచాలి | Sakshi
Sakshi News home page

భూసంస్కరణలు చేపట్టి భూములు పంచాలి

Published Wed, Nov 15 2023 1:12 AM

మాట్లాడుతున్న జిల్లా కన్వీనర్‌ రాఘవచారి  - Sakshi

మక్తల్‌: భూ సంస్కరణలు చేపట్టి పేదలకు భూము లు పంచాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవచారి అన్నారు. మంగళవారం మక్తల్‌లో విలేకరులతో మాట్లాడారు. కు ల అణచివేత, మతవిద్వేషాలు, పితృస్వామిక హింస, దోపిడీ రాజ్యహింసలేని స్వేచ్ఛాయుత, మానవీయ ప్రజాస్వామిక విలువలు ఉన్న సమాజం నిర్మించుకోవాలని కోరారు. గ్రామాల్లో సంపూర్ణ మద్యనిషేధం విధించి కుటుంబాల జీవన ప్రమాణాలు కాపాడాలని అన్నారు. కృష్ణానది నీరు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య న్యాయంగా పంచాలని కోరారు. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మరికల్‌ మండలం చిత్తనూర్‌ వద్ద ఉన్న ఇథనల్‌ కంపెని ఎత్తివేయాలని కోరారు. రైతు లు సాగు చేసిన పంటలు నష్టపోతున్నారని, వాతావరణ కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ సంస్థలతో అందరికి ఒకే విధమైన విద్యా, వైద్యం ఉచితంగా అందించాలని అన్నారు. నిరుద్యోగతకు ప్ర భుత్వం బాధ్యత వహిస్తూ.. నిరుద్యోగ వేతనం ప్రవేశపెట్టాలని అన్నారు. రోజుకు 4 షిఫ్టుల ఆరు గంటలు పని విధానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే వివిధ పార్టీ అభ్యర్థులను నిలదీయాలన్నారు. అక్టోబర్‌ 2, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ ఎదుట 30 గంటల సత్యాగ్రహ శిబిరం, ఆమోదించిన ప్రజా ఎజెండాను అమలు చేసేందుకు సత్యాగ్రహ శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా కోకన్వీనర్‌ సుదర్శన్‌రెడ్డి, కేఎన్‌పీఎస్‌ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ డి.చంద్రశేఖర్‌, విజయ్‌కుమార్‌, లింగన్న పాల్గొన్నారు.

పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవచారి

Advertisement
Advertisement