హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ పాలమూరు | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ పాలమూరు

Published Tue, Nov 14 2023 1:40 AM

బాలుర చాంపియన్‌ మహబూబ్‌నగర్‌ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న రమేశ్‌కుమార్‌ తదితరులు  - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం ముగిసిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 67వ రాష్ట్రస్థాయి అండర్‌–19 హ్యాండ్‌బాల్‌ టోర్నీలో బాలుర విభాగంలో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు సత్తాచాటి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో జిల్లా జట్టు 22–12 గోల్స్‌ తేడాతో కరీంనగర్‌పై విజయం సాధించింది. వరంగల్‌ జట్టు మూడోస్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో వరంగల్‌ చాంపియన్‌గా నిలిచింది.ఫైనల్‌ మ్యాచ్‌లో వరంగల్‌ జట్టు 11–4 గోల్స్‌ తేడాతో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించగా.. మూడోస్థానంలో ఖమ్మం జట్టు నిలిచింది.

విజేత జట్లకు బహుమతుల ప్రదానం

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ విన్నర్‌, రన్నరప్‌, థర్డ్‌ప్లేస్‌ జట్లకు ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఈఎంఆర్‌ఎస్‌ మాజీ క్రీడల అధికారి రమేశ్‌కుమార్‌, టోర్నీ రాష్ట్ర పరిశీలకులు జగన్‌మోహన్‌గౌడ్‌, అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాపిరెడ్డి తదితరులు ట్రోఫీలు, మెడల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నీలో తెలంగాణ జట్లు విజేతగా నిలవాలన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని సూచించారు. కార్యక్రమంలో టోర్నీ రాష్ట్ర పరిశీలకులు జగన్‌మోహన్‌గౌడ్‌, రఫత్‌ ఉమర్‌, పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి.జియావుద్దీన్‌, ఉపాధ్యక్షులు అనిల్‌కుమార్‌, జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్‌బాబు, సహాయ కార్యదర్శి వేణుగోపాల్‌, పీడీ బాల్‌రాజు, అహ్మద్‌ హుస్సేన్‌, రాంమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

టోర్నీలో ప్రతిభ చూపిన క్రీడాకారులను తెలంగాణ జట్టుకు ఎంపిక చేశారు. ఇందులో బాలుర జట్టులో ఐదుగురు, బాలికల జట్టులో ముగ్గురు ఉన్నారు. బాలుర జట్టుకు ధన్‌రాజ్‌గౌడ్‌, జునేద్‌, రోహిత్‌ భార్గవ్‌, చరిత్‌రెడ్డి, కౌషిక్‌ (మహబూబ్‌నగర్‌), మధు రోహిత్‌, సాయి, సాయి కార్తీక్‌, రూబి రతన్‌ (కరీంనగర్‌), జితేందర్‌, సాయికృష్ణ (వరంగల్‌), రఫివుద్దీన్‌, ఉదయ్‌ (మెదక్‌), సాయితేజ (రంగారెడ్డి), బాబా సాహెబ్‌ (హైదరాబాద్‌), రాంకుమార్‌ (ఆదిలాబాద్‌), బాలికల జట్టుకు సుదీక్ష, జ్యోతి, సంధ్య, వైష్ణవి (వరంగల్‌), కె.జ్యోతి, శివాణి, తన్మయి (మహబూబ్‌నగర్‌), క్రిష్ణవేణి, మీనాక్షి (ఖమ్మం), సాయిసంజన (రంగారెడ్డి), అక్షయ (మెదక్‌), వర్ష, నవనీత (నిజామాబాద్‌), శ్రావ్య (కరీంనగర్‌), అతీఫా సుల్తానా (నల్గొండ), సంధ్య (హైదరాబాద్‌) ఎంపికయ్యారు.

బాలికల విభాగంలో విజేతగా నిలిచిన వరంగల్‌

రన్నరప్‌గా నిలిచిన మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జట్లు

ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌

హ్యాండ్‌బాల్‌ టోర్నీ

బాలికల విభాగం రన్నరప్‌గా మహబూబ్‌నగర్‌ జట్టు
1/1

బాలికల విభాగం రన్నరప్‌గా మహబూబ్‌నగర్‌ జట్టు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement