
● సిట్ దర్యాప్తులో ఒక్కొక్కరిగాపేర్లు వెలుగులోకి..
● పట్టుబడిన వారిలో
ఉమ్మడి పాలమూరువాసులే అధికం
● తొలుత 9 మందిలో ఆరుగురు..ఆ తర్వాత మరో ముగ్గురు
● డీఆర్డీఓ అధికారుల నుంచి సైతంవివరాల సేకరణ
● కాంట్రాక్ట్ సిబ్బందిలో గుబులు
తొలుత ఆరుగురు..
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్లు లీకై నట్లు తొలుత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేపట్టిన విచారణలో గ్రూప్–1, తదితర ప్రశ్నపత్రాలు సైతం లీకై నట్లు బహిర్గతమైంది. అయితే తొలుత అదుపులోకి తీసుకున్న నిందితుల్లో తొమ్మిదిమందిలో ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఆరుగురు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. పట్టుబడిన ప్రధాన నిందితుల్లో రేణుకా రాథోడ్, లవుడ్యావత్ డాక్యా దంపతులు. రేణుకది గండేడ్ మండలం మన్సూర్‌పల్లి తండా కాగా.. డాక్యాది అదే మండలంలోని పంచాంగల్ తండా. వీరితోపాటు రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్‌నాయక్, రాజేంద్రనాయక్ మన్సూర్‌పల్లి తండాకు చెందినవారే.