
రొట్టెల తయారీని పరిశీలిస్తున్నప్రజాప్రతినిధులు, అధికారులు
గండేడ్: రొట్టెల యూనిట్ మెరుగుకు మరింత కృషి చేస్తామని జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి పేర్కొన్నారు. మంగళవారం ‘చిరుధాన్యాల రొట్టెలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. దీంతో మిల్లెట్ యూనిట్ వద్దకు వెళ్లి రొట్టెల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా రొట్టెల యూనిట్ నిర్వాహకులతో మాట్లాడారు. రొట్టెలు ఏ మేర తయారు చేస్తున్నారు.. ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు.. ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి.. ఇబ్బందులు ఏమైనా ఉన్నా యా అని యూనిట్ అధ్యక్షురాలు రాఘవేంద్రమ్మను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా రూ.లక్షలు వెచ్చించి యూనిట్‌ను ఏర్పాటు చేశామని దీనిని మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. తరుచుగా మూతపడకుండా రెగ్యులర్‌గా నడిపించుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. పనిచేయని మిగతా మిషన్లను సైతం త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తామని చెప్పారు. మంచి ఉత్పత్తులు చేపట్టి చిరుధాన్యాల యూనిట్‌కు జిల్లాస్థాయిలో పేరు తీసుకురావాలని సూచించారు. వారి వెంట ఎంపీడీఓ రూపేందర్‌రెడ్డి, సర్పంచ్ చంద్రకళ తదితరులున్నారు.
