
మృతుడు బాబు (ఫైల్)
షరతులు పాటించాలన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం, తానూర్‌లో ఈ నెల 30న నిర్వహించే శ్రీ రామ నవమి శోభాయాత్రకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఉద యం 9 నుంచి ఒంటి గంట వరకు యాత్రకు అనుమతి ఇచ్చింది. మతపరంగా, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, రాజకీయ నాయకులు, నేర చరిత్ర ఉన్నవారు యాత్రలో పాల్గొనరాదని స్పష్టం చేసింది. మసీదులు ఉన్న చోట యాత్ర సాగేటప్పుడు 150 మీటర్లకు ముందే సౌండ్ సిస్టం ఆపేయాలని సూచించింది. భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హిందూ వాహిని అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తా నూర్‌లో శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన ఎ.నరేందర్, ఆర్.గంగాప్రసాద్ మరో పిటిషన్ వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సూర్యకరణ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున న్యాయవాది సామల రవీందర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూ డిన అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రాణం తీసిన పొగ
చెత్త తగలబెడుతుండగా ఊపిరాడక రైతు మృతి
బూర్గంపాడు: జామా యిల్ తోటలో పోగైన చెత్తను తగలబెడుతుండగా పొగతో ఊపిరాడక ఒక రైతు మృతి చెందాడు. ఆల స్యంగా వెలుగుచూసి న ఈ సంఘటన వివరాలివి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన రైతు కలసాని బాబు (65) సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. అప్పటికే నరికిన జామాయి ల్ తోటలోని చెత్త తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో బాబు పొగ ధాటికి తట్టుకోలేక ఊపిరాడక కుప్పకూలాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు జామాయిల్ తోటకు వెళ్లగా బాబు మృతదేహం కనిపించింది. ఆయన ఒంటిపై ఎలాంటి కాలిన గాయాలు లేకపోవడంతో.. పొగ, మంటల తీవ్రతకు ఊపిరాడక అస్వస్థతకు గురై మృతి చెందాడని భావిస్తున్నారు. మృతునికి భార్య నాగమ్మ, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.