
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో సోమవారం శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది రంగస్థల కళాకారులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి.మనోహర్‌రెడ్డి, శ్రీమిత్ర కళానాట్య మండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ ప్రపంచరంగస్థల దినోత్సవం కళాకారులకు ఎంతో స్ఫూర్తివంతమైన రోజని అన్నారు. రంగస్థల నాటకరంగం వైభవం కోసం ఉమ్మడి జిల్లాలో వందలాది మంది కళాకారులు తమవంతు కృషి చేస్తున్నారని కొనియాడారు. నాటక రంగకళాకారులకు ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు ప్రభాకారాచారి, ఎన్.నర్సింలు, వెంకటేశ్వర్‌రావు, లక్ష్మణ్, వెంకటేశ్వర్‌రావు, శంకర్‌రావు, మాధవరాజు, దామోదర్, గంగన్న, భరత్, కృష్ణయ్య, బొల్లంపల్లి కృష్ణయ్య, దత్తాత్రేయచారి తదితరులు పాల్గొన్నారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: రాజస్థాన్ రాష్ట్రం బన్స్‌వారాలో సోమవారం నుంచి ప్రారంభమైన జూనియర్ నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. అసిఫుల్లాబేగ్, కె.జాన్‌పాల్, ఎంఎ.ఖుషాంలు రాష్ట్ర హ్యాండ్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపికపై మహబూబ్‌నగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ జియావుద్దీన్, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, సంయుక్త కార్యదర్శి ఒబేదుర్ రబ్, కోశాధికారి ముహిబుర్ రహెమాన్, కార్యనిర్వాహక కార్యదర్శి మహ్మద్ అహ్మద్ హుస్సేన్, ప్రదీప్‌కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

కళాకారులను సన్మానిస్తున్న మండలి సభ్యులు